కామన్వెల్త్ : భారత్ ఖాతాలో పది స్వర్ణాలు
న్యూఢిల్లీ,అక్టోబర్ 5: : కామన్వెల్త్ ఆటల పోటీలలో భారత్ ఖాతాలో పది స్వర్ణ పతకాలు చేరాయి. 55 కిలోల రెజ్టింగ్ విభాగంలో రాజేంద్ర కుమార్ కు స్వర్ణపతకం లభించింది. 58 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రేణుబాల చానుకు స్వర్ణ పతకం లభించింది. 50 మీటర్ల ఫిస్టల్ ఈవెంట్'లో ఓంకార్ సింగ్ స్వర్ణ పతకం సంపాధించాడు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ సింగిల్స్‌లో గగన్ నారంగ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, అభినవ్ బింద్రా రజితాన్ని సాధించాడు.
Comments