సంక్షోభంలో కర్ణాటక బీజేపీ సర్కార్

బెంగళూరు,అక్టోబర్ 6: : ఈ నెల 11న కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకుంటారు. 19 మంది శాసనసభ్యులు మద్దతు ఉపసంహరించుకోవడంతో యడ్యూరప్ప ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప గవర్నర్ హెచ్.ఆర్. భరధ్వజ్'ని కలసి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని వివరించారు. అనంతరం యడ్యూరప్ప విలేకరులతో మాట్లాడుతూ 11న శానస సభలో తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. బలనిరూపణలో తాను తప్పనిసరిగా నెగ్గుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు  నలుగురు అసమ్మతి మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు యడ్యూరప్పప్రకటించారు. వేటు పడినవారిలో శివరాజ్ తంగడిగి, వెంకటరామప్ప, నరేంద్రస్వామి, సుథాకర్‌లు ఉన్నారు. అలాగే మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను ఒప్పించి రాజీనామా చేయిస్తామన్నారు. దీంతోపాటు ఆరుగురు కొత్తమంత్రులను కేబినేట్‌లోకి చేర్చుకుంటామని సీఎం పేర్కొన్నారు.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు