న్యూజిలాండ్‌లో భారత సుగంధ ద్రవ్యమేళా
కోచి,అక్టోబర్ 17: అంతర్జాతీయ విపణిలో నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు లభించే దేశంగా పేరున్నభారత్ తన సుగంధ వీచికలను విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేస్తుండడం ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో నవంబర్ 1 నుంచి ఐదు రోజుల పాటు ‘సుగంధ ద్రవ్యోత్సవం’ నిర్వహించ తలపెట్టారు. అక్కడి ఇండియన్ హై కమిషన్ సహకారంతో భారత సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక మేళాలో సుగంధ ద్రవ్యాల ప్రదర్శన ఉంటుంది. ఈ మేళా సందర్శన ద్వారా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు భారత్ నుంచి విరివిగా వీటిని దిగుమతి చేసుకునే వీలుంది.
Comments