ముంబై వాణిజ్య సదస్సుకు ఒబామా
వాషింగ్టన్,అక్టోబర్ 17: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చే నెల 6న ముంబైలో వాణి జ్య సదస్సులో పాల్గొననున్నారు. భారత్, అమెరికా కార్పొరేట్ లీడర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) ఈ సదస్సు ఏర్పాటు చేసింది. వచ్చే నెల భారత పర్యటనకు రానున్న ఒబామా ముందుగా ఇండియా వాణిజ్య రాజధాని ముంబైలో ఆగనున్నారు. వైట్‌హౌస్ సూచన మేరకు ఈ సదస్సును ఏర్పాటు చేసినట్టు యూఎస్‌ఐబీసీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా-భారత వ్యాపార, పారిశ్రామిక వేత్తల సదస్సు నవంబర్ 6న (జరుగుతుందని తెలిపాయి. నాలుగు గంటలపాటు సాగే ఈ సమావేశంలో రెండు దేశాల్లో దీర్ఘకాల వ్యాపారవకాశాలపై చర్చించనున్నారు. ఒబామా ప్రత్యేక ప్రసంగంతో సదస్సు ముగుస్తుంది. అమెరికా వాణిజ్య మంత్రి గారీ లాక్‌కీ, భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా సదస్సులో ప్రసంగిస్తారు. యూఎస్‌ఐబీసీలో పెప్సికో, బోయింగ్, వాల్ మార్ట్, లక్‌హీద్ మార్టిన్ వంటి అగ్రశేణి కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో 375 కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఇండియాతో వాణిజ్య సంబంధాల పటిష్టతతో పాటు తమ దేశంలో ఉద్యోగాల కల్పన, స్వేచ్ఛా వాణిజ్యానికి కట్టుబడి ఉన్నందునే ముంబై వాణి జ్య సదస్సులో పాల్గొనేందుకు ఒబామా అంగీకరించారని యూఎస్‌ఐబీసీ చైర్మన్ ప్రెసిడెంట్ రాన్ సోమర్స్ పేర్కొన్నారు.
Comments