రైల్వే ఉద్యోగులకు 77 రోజుల బోనస్
న్యూఢిల్లీ,అక్టోబర్ 5: దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు శుభవార్త. రైల్వేలలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి ఉత్పాదకత ఆధారంగా 77 రోజుల బోనస్‌ను కేంద్రం దీపావళి కానుకగా ప్రకటించింది. రైల్వేశాఖ ఈ మేరకు చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కాగా, ఉత్పాదకత ఆధారంగా రైల్వే శాఖ ప్రకటించిన బోనస్ మొత్తం ఇదే అత్యధికం. రైల్వేలలోని 12.92 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 77 రోజుల బోనస్ చెల్లించేందుకు కేంద్రంపై రూ.1065.42 కోట్ల మేరకు భారం పడుతుందని అంచనా. బోనస్ పొందడానికి ఉద్యోగుల వేతన పరిమితిని రూ.3,500గా నిర్ణయించారు.
Comments