Posts

కత్రోకీ కేసు ఖతం !

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 5:  నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ మిస్టర్‌క్లీన్ ఇమేజ్‌ను దెబ్బ తీసి  1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి దారి తీసిన  బోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అట్టావియో కత్రోకీకి  సీబీఐ విజయవంతంగా విముక్తి ప్రసాదించింది. ఇటలీ వ్యాపారవేత్త, బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న కత్రోకీని ప్రాసిక్యూషన్ నుంచి ఉపసంహరించాలన్న సీబీఐ విజ్ఞప్తికి ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదం తెలిపింది. కత్రోకీపై విచారణను ఇంకా సాగదీయడంలో అర్థంలేదన్న సీబీఐ వాదనతో ఏకీభవించింది. ఈ సందర్భంగా ‘ఒక కేసుకు తర్కబద్ధమైన పరిష్కారం సాధ్యం కానప్పుడు.. దానిని వదిలేయడమే ఉత్తమం’ అని ఒక హిందీ సినిమా పాటను ఉటంకిస్తూ మేజిస్ట్రేట్ వినోద్ యాదవ్ వ్యాఖ్యానించారు.  కత్రోకీని క్యూగా సంబోధిస్తూ.. ఆయనను భారత్‌కు రప్పించే భారాన్ని దేశం ఇకపై భరించజాలదని, ఇప్పటికే రూ.250 కోట్లను అందుకు ఖర్చయ్యాయని.. అందువల్ల ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు నుంచి కత్రోకీని తొలగించడమే ఉత్తమమని భావిస్తున్నామని 73 పేజీల తీర్పులో పేర్కొన్నారు.   

కాంగ్రెసు ఎ. పి ఇంచార్జీగా మొయిలీ ఔట్... గులాం నబీపై భారం

Image
న్యూఢిల్లీ,మార్చి 4:  కాంఫ్రెస్  పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ  వర్కింగ్ కమిటీ (సిడబ్య్లూసి) ని శుక్రవారం పునర్వ్యస్థీకరించారు. ప్రధానంగా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీని మార్చారు. వీరప్ప మొయిలీని తొలగించి ఆయన స్థానంలో గులాం నబీ ఆజాద్‌ను నియమించారు.  2004 శాసనసభ ఎన్నికల సమయంలో గులాం నబీ ఆజాద్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ వ్యవహారాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. అలాగే పార్టీ నాయకులతోనూ మంచి సంబంధాలున్నాయి. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నేతగా ఎన్నుకునే సమయంలో ప్రత్యేకంగా గులాం నబీ ఆజాద్‌ను హైదరాబాద్ పంపించిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు కుదుర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పినా వినకుండా కాంగ్రెసుకు విజయ మార్గం వేసి పెట్టారని అంటారు. రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా ఉన్న స్థితిలో గులాం నబీ ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించడం వల్ల సమస్య పరిష్కారం సులభమవుతుందని సోనియా భావించినట్లు చెబుతున్నారు. తెలంగాణ సమస్య పరిష్కార...

కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ మృతి

Image
న్యూ ఢిల్లీ,మార్చి 4: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అర్జున్ సింగ్ (80)కన్నుమూశారు. 1930 నవంబర్ 5న జన్మించిన అర్జున్ సింగ్ 1980-85,1988-89లలో రెండు సార్లు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004-2009లో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో ఆయన మావనవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. 1957లో మధ్యప్రదేశ్'లో ఎమ్మెల్యేగా ఎంపికైన అర్జున్ సింగ్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక పదవులు చేపట్టారు.    

తెలంగాణ ఉద్యోగుల సహాయనిరాకరణ విరమణ

హైదరాబాద్, మార్చి 4 : తెలంగాణ ఉద్యోగులు సహాయనిరాకరణను విరమించారు. మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్యవర్తిత్వం ఫలించింది. ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డితో తెలంగాణ ఉద్యోగులు జరిపిన చర్చలు ఫలించాయి.  శనివారం నుంచి నుంచి తెలంగాణ ఉద్యోగులు విధులకు హాజరవుతారు.

బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ విజయం

ఢాకా, మార్చి 4 :  ప్రపంచ కప్ 'లో బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట  బంగ్లాదేశ్ జట్టు 18.5 ఓవర్లకే 58 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 59 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 12.2 ఓవర్లకే ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసి విజయం సాధించింది. జింబాంబ్వేపై న్యూజిలాండ్ ఘనవిజయం అహ్మదాబాద్:  మరో మ్యాచ్ లో జింబాంబ్వేపై న్యూజీలాండ్ పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత జింబాంబ్వే 46.2 ఓవర్లకు 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన  న్యూజిలాండ్ 33.3 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 166 పరుగులు చేసింది 

లోక్‌సభలో కొనసాగిన తెలంగాణ ప్రతిష్టంభన

న్యూఢిల్లీ, మార్చి 4 : లోక్‌సభలో శుక్రవారం కూడా తెలంగాణ ప్రతిష్టంభన కొనసాగింది.  సమావేశాలు ప్రారంభం కాగానే తెలంగాణపై చర్చ జరపాలంటూ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీ విజయశాంతి స్పీకర్ పోడియం వద్దకు దూసుకు వచ్చారు. జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ మీరా కుమార్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తెలంగాణపై చర్చించాలని పట్టుపట్టారు. అయితే స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించటంతో టీఆర్‌ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.  వారికి మద్దతుగా టీడీపీ తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్‌లు సభ ను  బహిష్కరించారు. తెలంగాణలో ప్రజలు, విద్యార్థులు, న్యాయవాదులు, ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ తర్వాత మీడియా సమావేసంలో  మండిపడ్డారు.  రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపచేసినా కేంద్రంలో స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. ఇక ప్రజాక్షేత్రంలోనే  తేల్చుకుంటామని కేసీఆర్ హెచ...

రాజ్యసభకు హేమమాలిని: కర్ణాటక నుంచి గెలుపు

Image
బెంగళూరు,మార్చి 4: కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానానికి గురువారం జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, నిన్నటితరం బాలీవుడ్ నటి హేమమాలిని గెలుపొందారు. ఆమెకు 106 తొలి ప్రాధాన్యతా ఓట్లు లభించగా, ఆమె ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి మరుళ సిద్ధప్పకు 94 ఓట్లు వచ్చాయి. ఐదు ఓట్లు చెల్లలేదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు సిద్ధప్పకు మద్దతునిచ్చాయి. జేడీఎస్ సభ్యుడు ఎం. రాజశేఖర మూర్తి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. హేమమాలిని 18 నెలలపాటు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతారు. రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన అనంతరం హేమమాలిని మాట్లాడుతూ ఓ కళాకారిణిగా తాను అందరి మనిషినని తెలిపారు. కర్ణాటక అభివృద్ధికి  కృషి చేస్తానన్నారు. 

తెలంగాణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ అధిష్టానం

ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమన్న ప్రణబ్ న్యూఢిల్లీ, మార్చి 4:   తెలంగాణపై ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. కాంగ్రెస్ కోర్ కమిటీ ముఖ్యులు ప్రణబ్‌ముఖర్జీ, అహ్మద్‌పటేల్, వీరప్ప మొయిలీ, పవన్‌కుమార్ బన్సల్, నారాయణ స్వామిలతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గురువారం రాత్రి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన భేటీ గంటా యాభై నిమిషాల పాటు సాగింది. అర్థం చేసుకొని సహకరించాలని, సంయమనం పాటించాలని వారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు.  ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేదాకా తెలంగాణపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని నిస్సహాయ పరిస్థితి ఉందని రాజీనామాల యోచన విరమించుకోవాలని  వారు హితవు పలికినట్టు సమాచారం.  కనీసం శ్రీకృష్ణ కమిటీపై రెండో విడత అఖిలపక్ష భేటీ కూడా ఎప్పుడు ఉంటుందో కూడా వారు స్పష్టం గా హామీ ఇవ్వలేదని తెలిసింది.  తెలంగాణ సమస్యకు పరిష్కారం కోసం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని వీరప్పమొయిలీ మీడియాకు వెల్లడించారు.. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎంపీలంతా గట్టిగా కోరారు. ప్రణబ్ ఓపిగ్గా విన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు...

కెనడాపై పాక్ గెలుపు

కొలంబో,మార్చి 4: వరల్డ్ కప్ లో   గురువారం ప్రేమదాస స్టేడియంలోజరిగిన ఎ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్. 46 పరుగుల తేడాతో కెనడాపై గెలిచిoది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 43 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటయింది. టాప్ ఆర్డర్‌లో ఎవరూ కుదురుగా ఆడకపోవడంతో పాక్ 67 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మిస్బావుల్ హక్ (68 బంతుల్లో 37; 1 ఫోర్), ఉమర్ అక్మల్ (68 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. కానీ కెనడా బౌలర్లు అనూహ్యంగా విజృంభించారు. కేవలం మూడు పరుగుల వ్యవధిలో ఆఖరి నాలుగు వికెట్లు తీశారు. దీంతో పాక్ పూర్తి కోటా ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కెనడా బౌలర్లలో బైద్వాన్ మూడు వికెట్లు తీసుకోగా... చీమా, బాలాజీరావు, హంస్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. తరువాత  కెనడా జట్టు 42.5 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటయింది.  పాక్ కెప్టెన్ ఆఫ్రిది (5/23) సంచలన బౌలింగ్‌తో పాకిస్థాన్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. పాక్ కెప్టెన్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో పాక్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. మొత్తం మూడు మ్యాచ్‌...

తెలంగాణపై మంత్రి పదవికి జూపల్లి కృష్ణారావు రాజీనామా

Image
హైదరాబాద్ ,మార్చి 3 :    రాష్ట్ర దేవాదాయ  శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ జూపల్లి తన రాజీనామా లేఖను సోనియాకు పంపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా  రాజీనామా లేఖను సమర్పించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో తిరిగే పరిస్థితులు లేనందున పదవికి రాజీనామా చేసినట్లు   చెప్పారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు  తెలిపారు. అవసరం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు సైతం సిద్ధమన్నారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న మాటలకు కట్టుబడే  రాజీనామా చేసినట్లు జూపల్లి తెలిపారు. ఓయూలో విద్యార్థుల సమక్షంలో తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని ఆనాడే చెప్పానన్నారు.  శాసనసభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు లేకుండా మంత్రులుగా తాము ఉండటం తగదన్నారు. త్యాగాలకు మారుపేరు తెలంగాణ ప్రజలన్నారు. నోరుపారేసుకునేవారికి ...

చంటి గుడ్డు నెదర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా భారీ విజయం

చండీగఢ్ ,మార్చి 3 :  ప్రపంచకప్‌లో భాగంగా గురువారమిక్కడ జరిగిన 16వ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా చేతిలో వోటమి పాలైంది.   చంటి గుడ్డు నెదర్లాండ్స్ పై  దక్షిణాఫ్రికా 231 పరుగులతో తేడాతో విజయం సాధించింది. 352 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 34.5 ఓవర్లలో 120 పరుగులకు ఆలౌట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్ లో బారిసీ(44) మినహా అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తహీర్ 3, కల్లిస్ 2, పీటర్‌సన్ 2 వికెట్లు తీశారు. స్టెయిన్, డుమిని చెరో వికెట్ దక్కించుకున్నారు.   

సుప్రీంకోర్టు చివాట్లతో తప్పుకున్న థామస్

Image
న్యూఢిల్లీ,మార్చి 3 : సెంట్రల్  విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) పదవికి రాజీనామా చేయనన్న సీజే థామస్ సుప్రీంకోర్టు చివాట్లతో ఎట్టకేలకు తన పట్టువీడారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ పదవికి ఆయన గురువారం రాజీనామా చేశారు. తన నియామకంపై ఒకవైపు ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలతో పాటు, సీవీసీ నియామకం చెల్లదంటూ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో థామస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల సమయంలో ఆయన టెలికం శాఖ కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ పీజే థామస్ నియామకాన్ని కొట్టివేస్తూ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గౌరవిస్తానని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ గురువారం సాయంత్రం సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ నూతన కేంద్ర విజిలెన్స్ కమిషనర్ నియామకం పై చర్చించినట్టు తెలిసింది. ,  

టై గా ముగిసిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్

బెంగళూరు,ఫిబ్రవరి 27:  వరల్డ్ కప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ టై గా ముగిసింది. భారత్ విసిరిన 338 పరుగుల  భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో  338 పరుగులు చేసింది.  ఎంతో  టెన్షన్‌గా సాగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఇరుజట్లకు చేరో పాయింట్ వచ్చింది.   భారత్ విసిరిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా దూసుకె ళ్లిన స్ట్రాస్, బెల్‌ జోడి జోరుకు స్ట్రైకింగ్ బౌలర్ జహీర్ ఖాన్ ఒక్కసారిగా కళ్లేం వేశాడు. 42వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 280 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లిష్ టీం వెన్ను విరిచాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ నీదా-నాదా అనేరీతిలో దోబుచులాడింది. చావ్లా వేసిన 48వ ఓవర్‌లో టెయిల్ ఎండర్లు బ్రాసన్, స్వాన్‌లు తలో సిక్స్ బాదడంతో మ్యాచ్  ఉత్కంఠకు చేరింది. మునాఫ్ వేసిన చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సి ఉండగా షాజద్ ఓ సిక్స్ చేశాడు.  దీంతో చివరి బంతికి గెలుపు రెండు పరుగులు చేయాల్సి ఉండగా, కట్టుదిట్టమైన ఫీల్డింగ్‌తో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ...

శ్రీలంక పై పాక్ గెలుపు

కొలంబో,ఫిబ్రవరి 26: వరల్డ్ కప్  గ్రూప్ ఏలో  రెండు మాజీ ప్రపంచ చాంపియన్లయిన  శ్రీలంక- పాకిస్థాన్ జట్ల మధ్య శనివారం స్థానిక ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 11 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిస్బా ఉల్ హక్ (91 బంతుల్లో 83 నాటౌట్; ఫోర్లు 6), సీనియర్ ఆటగాడు యూనిస్ ఖాన్ (76 బంతుల్లో 72; ఫోర్లు 4) అర్ధ సెంచరీలతో రాణించి జట్టును ఆదుకున్నారు. దీనికి ప్రతిగా ఆతిథ్య లంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. సంగక్కర (61 బంతుల్లో 49; ఫోర్లు 2, సిక్స్ 1), చమర సిల్వ (78 బంతుల్లో 57; ఫోర్లు 5) ఇద్దరే రాణించారు. 34 పరుగులకు నాలుగు వికెట్లు తీసిన ఆఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

మార్చి 10న హైదరాబాద్ దిగ్బంధం: కేసీఆర్

హైదరాబాద్,ఫిబ్రవరి 26: మార్చి 10న  10 లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ జిల్లాల ప్రజలందరినీ హైదరాబాద్ తరలించి, చీమ కూడా కదలకుండా దిగ్బంధిస్తామని,  రాజధాని రోడ్లపైనే వంటావార్పు చేస్తాంమని   హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో నిరసన దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు  కేసీఆర్ సంఘీభావం ప్రకటించారు. ‘ప్రధాని కుర్చీల కూసున్న మన్మోహన్ ఒక పాణం లేని బొమ్మ అని .  కేంద్రం దిగి రావాలంటె మార్చి 10న హైదరాబాద్‌లోకి చీమను కూడా అడుగు పెట్టనీయొద్దు. నగరమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోవాలె’’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘‘డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణను పోగొట్టింది, అప్పటిదాకా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులే. రాజీనామా చేస్తే బంపర్ మెజారిటీతో గెలిపిస్తనని చెప్పిన. అయినా పదవులుపోతే సచ్చిపోతామంటున్నరు. ఇలాంటి సవటలను, దద్దమ్మలను నమ్ముకుంటే తెలంగాణ రాదు. 4 లక్షల మంది ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణను చూసైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు ...

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలంగాణ పై నిర్ణయం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26:  మే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే  తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. అప్పటి వరకు సమస్యపై నాంపుడు ధోరణి అవలంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందన ఇలాంటి సున్నితమైన అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఒత్తిడి చేస్తుండడంతో  తెలంగాణ సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ అధిష్టానం అవసరంగా భావిస్తోంది. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇప్పటికే అధిష్టానానికి తేల్చి చెప్పారు. చెప్పినట్టు సమాచారం. కాగా,  హైదరాబాద్ చిక్కుముడిని విప్పితే సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగిన కసరత్తు చేస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించి...

రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమే

Image
 కాంగ్రెస్ హైకమాండ్‌ పై  సీనియర్ నేత దివాకరరెడ్డి ధ్వజం  హైదరాబాద్,ఫిబ్రవరి 26: కాంగ్రెస్ హైకమాండ్‌కు ఏమాత్రం బుద్ధిలేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.దివాకర్ రెడ్డి సంచలన  వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంలో పెద్దలమని చెప్పుకునే వారు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. వారు తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్ర రావణకాష్టాన్ని తలపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక చర్చావేదికలో పాల్గొన్న జేసీ.. కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన వల్లే రాష్ట్రంలో ఈ తరహా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆయన ఎవరిని అడిగి ఆ ప్రకటన చేశారో ఇప్పటికీ ఎవరికీ తెలియదన్నారు. అధిష్టానం తీసుకునే మతిలేని నిర్ణయాలు, బుద్ధిలేని చర్యల వల్ల పరిస్థితి ఈ విధంగా దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఈ ఖర్మ కాంగ్రెస్ స్వయంకృతమేనన్నారు. తెరాస చీఫ్ కేసీఆర్ కూడా ఒక రాజకీయ నేతగా కాకుండా ఉద్యమ నేతగానే ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఆయన చేస్తున్న హెచ్చరికల వల్ల హైదరాబాద్‌లో నివశించే 80 శాతం సీమాంధ్రులు భయంతో జీవనం సాగిస్తున్నారన్నారు. అంతేకాకుండ...

చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నారై ఎన్నిక

Image
చికాగో, ఫిబ్రవరి 25:  ఉత్తర చికాగోలోని 47వ వార్డుకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతి యువకుడు అమేయ పవార్ విజయ దుందుభి మోగించాడు. .. ఈ వార్డుకి 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ వేత్తను ఖంగుతినిపించి  తొలిసారి చికాగో సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకు జన్మించిన పవార్ పట్టభద్రుడై అతిమామూలుగా వార్డు ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే  ఓటర్లు 50 శాతం ఓట్లతో పట్టంకట్టారు. ఈ విజయం అపురూపమైనదని, అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పవార్ చెప్పారు. 

ప్రపంచకప్: న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం

నాగ్‌పూర్ ,ఫిబ్రవరి 25: వరల్డ్ కప్ లో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై  ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 206 పరుగులకు ఆలౌట్ కాగా... ఆస్ట్రేలియా కేవలం 34 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులతో లక్ష్యాన్ని అధిగమించింది. పేసర్ మిచెల్ జాన్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ మార్చి 4న జింబాబ్వేతో; ఆస్ట్రేలియా మార్చి 5న శ్రీలంకతో తలపడతాయి. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకిది వరుసగా 25వ విజయం కావడం విశేషం. 1999 ఫైనల్ నుంచి ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచింది. బంగ్లాదేశ్ తొలి విజయం,  కాగా, ఢాకా లో  శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 27 పరుగుల ఆధిక్యంతో ఐర్లాండ్‌పై నెగ్గి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది.  206 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ 45 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 151 పరుగులకు ఐదు వికెట్లతో లక్ష్యం ద...

‘జన్మభూమి గౌరవ్’ పేరుతో నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్ళు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25: రైల్వే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు  మమతా బెనర్జీ రైల్వే  బడ్జెట్‌లో  నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రకటించారు. ప్రత్యేకంగా  ‘జన్మభూమి గౌరవ్’ పేరుతో దేశంలోని చారిత్రక, విద్యా ప్రాంతాలను అనుసంధానిస్తూ  ఈ నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెడతారు. .1. హౌరా-బోల్పూర్-రాజ్‌గిర్(నలంద)-పాటలీపుత్ర(పాట్నా)- వారణాసి(సార్నాథ్)-గయ-హౌరా 2. బెంగళూరు-మైసూరు-హసన్ (స్పేస్ ఫెసిలిటీ, బెలూర్, హలేబిద్, శ్రావాణ్‌బెంగొలా)-హూబ్లీ-గడగ్(హంపి)-బిజాపూర్ (గోలె గుంబాజ్)-బెంగళూరు 3. చెన్నై-పుదుచ్చేరి-తిరుచిరాపల్లి-మదురై-కన్యాకుమారి- తిరువనంతపురం-ఎర్నాకుళం-చెన్నై   4. ముంబై-  అహ్మదాబాద్-(లోథల్)-భావ్‌నగర్(పాలిటానా)-అలాంగ్)-గిర్-డయూ (సోమనాథ్-వెరావల్)-(జునాగఢ్)-రాజ్‌కోట్-ముంబై మార్గాలలో ఈ రైళ్ళు ప్రయాణిస్తాయి.