ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలంగాణ పై నిర్ణయం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26: మే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని ఢిల్లీ వర్గాల సమాచారం. అప్పటి వరకు సమస్యపై నాంపుడు ధోరణి అవలంభించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందన ఇలాంటి సున్నితమైన అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఒత్తిడి చేస్తుండడంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడం కాంగ్రెస్ అధిష్టానం అవసరంగా భావిస్తోంది. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే తాము రాజీనామాలు చేస్తామని కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇప్పటికే అధిష్టానానికి తేల్చి చెప్పారు. చెప్పినట్టు సమాచారం. కాగా, హైదరాబాద్ చిక్కుముడిని విప్పితే సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు తగిన కసరత్తు చేస్తోంది. శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు తెలంగాణకు అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, పదేళ్లు ప్రయోగం చేయడం, అది విఫలమైతే తెలంగాణ ఏర్పాటు చేయడం అనే సిఫార్సుకే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు.. యూపీఏ సర్కార్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, . రాష్ట్రాన్ని వేర్వేరు రాజధానులతో రెండుగా విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలనే అంశంపై కూడా తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
Comments