ఎయిర్ పోర్టు బస్సు దగ్ధం
హైదరాబాద్ ,మార్చి 13: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికులతో వెళుతున్న ఏరో ఎక్స్ ప్రెస్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్‌గూడా చౌరస్తా వద్ద బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ 45 మంది ప్రయాణికులను సురక్షితంగా క్రిందికి దించారు. శంషాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపల బస్సు మొత్తం కాలిపోయింది. ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద కారణాలు తెలియరాలేదు.
Comments