రాష్ట్రంలో అయిదు ఆదర్శ రైల్వే స్టేషన్లు
న్యూఢిల్లీ,మార్చి 14: కొత్త రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు.. కోరుకొండ - విజయనగరం డబ్లింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో కొన్ని కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బెంగళూరు, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - గుడివాడ రైలు మార్గాలను ప్రతిపాదించారు. బీబీనగర్ - నల్లపాడు రైలు మార్గాన్ని విద్యుద్దీకరించాలని ప్రతిపాదించారు. కొన్ని మార్గాలను రైల్వే లైన్ సర్వే కోసం ఎంపిక చేశారు.
Comments