Monday, March 26, 2012

అసెంబ్లీ వద్ద తెరాస సభ్యుల హల్ చల్...

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు సోమవారం అసెంబ్లీ ద్వారానికి అడ్డుగా పడుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను లోనికి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గేటు ముందు అడ్డంగా సభ్యులు లోనికి వెళ్లకుండా పడుకున్నారు. మిగిలిన వారందరూ అక్కడే బైఠాయించారు. తెలంగాణపై మాట తప్పిన పార్టీలకు అసెంబ్లీలో ప్రవేశం లేదని, తెలంగాణ ద్రోహులను లోనికి వెళ్లనివ్వమని, సమైక్యవాదులకు, వెన్నుపోటు పొడిచిన వారికి ఇక్కడ స్థానం లేదని వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు గంప గోవర్ధన్, జోగు రామన్న, టి.రాజయ్య, జూపల్లి కృష్ణా రావు, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సభలో తెరాస బలం 16, బిజెపి బలం 3కు పెరిగింది.నెల్లూరు జిల్లా కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 29న ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...