Tuesday, March 20, 2012

తిరుపతి ఉపఎన్నికకు టి.డి.పి. అభ్యర్ధిగా మోహన్ బాబు ?

హైదరాబాద్,మార్చి 20:   కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. సోమవారం మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు చిత్తూరులోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు సూచించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.  ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు.  మోహన్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని అన్నారు.  ఐటి రంగంలో ప్రపంచానికి ధీటుగా హైదరాబాదును నిలిపారన్నారు. రాజకీయ ఆరంగేట్రంపై  స్పందించేందుకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరి రజ్యసభకు ఎన్నిక కానుండడ్మ్ తో తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో టి.డి.పి. అభ్యర్ధి గా  మోహన్ బాబును బరిలో దింపాలన్నది బాబు వ్యూహం గా  కనిపిస్తోంది..
పోటీకి చిరు కుటుంబం దూరం?
కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్లనుండటంతో ఖాళీ అవుతున్న తిరుపతి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ బరిలో నిలిచే అవకాశముందని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తిరుపతిలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని చెప్పారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన పక్షంలో తిరుపతి నుండి చిరంజీవి సోదరుడు నాగబాబు లేదా భార్య సురేఖ పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. అయితే చిరు తాజా ప్రకటన తో  గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్  కాంగ్రెస్  అభ్యర్ధి గా బరిలో దిగే అవకాశం ఉంది. అరోవైపు చిరుపై అభిమానులు వత్తిడి తెస్తే ఆయన కుటుంబం నుంచి నాగబాబు లేదా  సురేఖ పోటీ తప్పకపోవచ్చు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...