శతశతక వీరుడు....
మీర్పూర్ , మార్చి 16 : ఎట్టకేలకు సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేశాడు. 138 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ పూర్తిచేసి అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్ గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టెస్ట్ లో 51వ సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49వ సెంచరీలు చేశాడు.

Comments