Friday, March 16, 2012

సామాన్యులకు ఇది తొక్కలో బడ్జెటే...!

న్యూఢిల్లీ, మార్చి 16 : కేంద్ర ఆర్థిక  మంత్రి ప్రణబ్ ముఖర్జీ  శుక్రవారం పార్లమెంట్ కు సమర్పించిన 2012-2013 బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచారు.  రెండు లక్షలు దాటి ఐదు లక్షల వరకు గల ఆదాయంపై 10 శాతం పన్ను విధించనున్నారు. అలాగే ఐదు నుంచి పది లక్షల వరకు 20 శాతం, అటుపైన పది లక్షల నుండి ఆ పై ఆదాయంపై 30 శాతం ఆదాయం పన్ను విధిస్తారు.
 బడ్జెట్ ముఖ్యాంశాలు...
ఎన్ జి రంగా విశ్వవిద్యాలయానికి 100 కోట్లు
ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్స్
చిత్రపరిశ్రమకు  సేవా పన్ను తొలగింపు
వెయ్యి జనాభా గల గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్ లు
విమాన ఇంధనం నేరుగా విదేశాల నుంచి కొనుగోలు
25 లక్షలలోపు గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
వితంతు, వికలాంగులకు పింఛన్ రూ.200 నుంచి రూ.300లకు పెంపు
10 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్ 12 శాతానికి పెంపు- విందు, వినోదం, విహారాలు ఇక ప్రజలకు భారం
పెద్ద కార్లపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు
ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు పెరిగే అవకాశం
సిగరెట్‌, బీడీలు, పాన్‌ మసాలలు, గుట్కాల పై  పన్ను పెంపు
పెరగనున్న మొబైల్ బిల్లులూ
 బ్రాండెడ్ రిటైల్ గార్మెంట్లపై 10 శాతం పన్ను
ఉప్పు,   అగ్గిపెట్టెలు, సౌర దీపాల ధరలు,   ప్యాకేజి ఆహారం ధరలు తగ్గింపు
తగ్గనున్న ఎల్.సి.డి ., ఎల్.ఇ.డి,, స్వదేశీ మొబైల్ , బ్రాండెడ్ వెండి ఆభరణాలు, క్యాన్సర్, హెచ్,ఐ,వి, మందుల ధరలు 
ప్లాటినం దిగుమతిపై సుంకం 10 శాతం పెంపు
బంగారం దిగుమతిపై సుంకం 5 శాతం పెంపు

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...