భారత్ పై బంగ్లా సంచలన విజయం
మీర్‌పూర్,మార్చి 16: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా 4 బంతులు మిగిలి వుండగానే ఛేదించి భారత్‌కు షాకిచ్చింది. భారత్‌తో శుక్రవారం షేర్ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని చేజిక్కించుకుని ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ 70 పరుగులతో శుభారంభాన్నివ్వగా, జాహురుల్ ఇస్లామ్(53), నాసిర్ హుస్సేన్ (54) పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో హకిబుల్ హసన్ (49), రహీమ్ (45)పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ బౌలర్లు సమష్టిగా విఫలమై బంగ్లా విజయానికి బాటలు వేశారు. ఒక్క ప్రవీణ్ కుమార్ మాత్రమే మూడు వికెట్లు తీశాడు. భారత్ ఫైనల్ కు చేరాలంటే ఈ నెల 18న పాక్ తో జరిగే మ్యాచ్ లో గెలవాల్సి ఉంది.
Comments