రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు
హైదరాబాద్,మార్చి 23: : రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ నందన నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం పంచాంగ పఠనం చేశారు. వివిధ రంగాలలో విశిష్ట పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన పలువురికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది పురస్కారాలు అందజేశారు. మంత్రులు వట్టి వసంత కుమార్, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Comments