ఉత్తర భారత దేశంలో మళ్ళీ భూప్రకంపనలు
న్యూఢిల్లీ :ఉత్తర భారత దేశంలో మళ్ళీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.37 నిముషాలకు ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ లలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.5 గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. నార్త్‌లో నిన్న కూడా ప్రకంపనలు సంభవించాయి. వరుస ప్రకంపనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
Comments