Wednesday, March 14, 2012

రైల్వేఛార్జీలు పెంపు:ఫ్లాట్ ఫాం టిక్కెట్ ఇక రు.5

న్యూఢిల్లీ,మార్చి 14:   కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీల పెంపుతో ప్రయాణికులకు షాక్ ఇచ్చారు.  అన్ని తరగతులకు కిలోమీటర్ కు రెండుపైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. అలాగే ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.3 నుంచి రూ.5 కు పెరిగింది. స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు అయిదు పైసలు, ఫస్ట్ క్లాస్ ఏసీకి కిలోమీటర్ కు 30 పైసలు, సెకండ్ ఏసీకి 15 పైసలు, థర్డ్ ఏసీకి పది పైసలు పెంచారు. రైవే చార్జీలు పెంచడం పదేళ్ళ  తరువాత ఇదే మొదటిసారి.  రైల్వే ఉద్యోగులకు  78 రోజుల బోనస్ ను రైల్వే మంత్రి  ప్రకటించారు.  ప్రతి ఏడాది పదిమంది క్రీడాకారులకు రైల్ ఖేల్ రత్న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అన్ని రైళ్లకు జీపీఎస్ సౌకర్యం, కొత్త కేటరింగ్ కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టడం, ఢిల్లీ-జోద్ పూర్ మధ్య హైస్పీడ్ రైలుకు ప్రతిపాదన, రాష్ట్రాలు  సహకరించే ప్రాజెక్టులకు పెద్దపీట, ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, రైల్వేబోర్డు పునర్ వ్యవస్థీకరణ్, రైల్వే బోర్డులో కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ప్రత్యేక హౌస్ కీపింగ్ బాడీ ఏర్పాటు, ప్రతి మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో త్వరలోనే వికలాంగులకు ప్రత్యేక బోగీ ఏర్పాటు---  బడ్జెట్ లోని ఇతర ముఖ్యాన్శాలు. కాగా మొబైల్ ఎస్ ఎంఎస్, గుర్తింపు పత్రాన్ని ఈ టిక్కెట్ గా పరిగణిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 ఎక్స్ ప్రెస్, 21 కొత్త ప్యాసింజర్ రైళ్లు, అయిదు డీఎంయూలు, ఎనిమిది ఎంఈఎంయూలు, 2,500 బోగీల్లో గ్రీన్ టాయిలెట్ లు ఏర్పాటు,  వచ్చే ఏడాదికల్లా 1100 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ ను  బడ్జెట్ లో ప్రతిపాదించారు. రూ.60,100 కోట్ల రైల్వే వార్షిక బడ్జెట్ గత రైల్వే బడ్జెట్ల కంటే  భారీ బడ్జెట్  అని మంత్రి తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 19వేల కిలోమీటర్ల ట్రాక్ ల నవీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు రైల్వేలను విస్తరిస్తామన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...