తెలంగాణా ప్రాంతీయ మండలా..అదేం లేదే...చిదంబరం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29: తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే వార్తల్లో నిజం లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ అంశంపై ఏ విధమైన పురోగతి లేదని ఆయన స్పష్టం చేశారు.తీవ్రవాదుల కుట్రను మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సంస్థలు కలిసి భగ్నం చేశాయని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో దాడులకు కుట్ర చేశారని ఆయన చెప్పారు. దేశంలో పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారంతో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు ఆయన తెలిపారు. వివిఐపిలను వారు లక్ష్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసిన మూడు రాష్ట్రాల పోలీసులను, కేంద్ర సంస్థలను ఆయన అభినందించారు.ఎన్‌సిటిసి వివాదంపై సిఎస్‌లు, డిజీలు, ఎటిఎస్ చీఫ్‌లతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments