శ్రీలంక సంచలన విజయం
హొబర్ట్,ఫిబ్రవరి 24: ముక్కోణపు క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 85 పరుగులు, చంఢీమాల్ 80 పరుగులు చేశారు. క్రిస్టియన్ మూడు వికెట్లు, హిల్ఫెన్ హాస్ రెండు, హారిస్, డోహెర్టీలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్ లో ప్రస్తుతం శ్రీలంక 15 పాయింట్లు, ఆస్ట్రేలియా 14, భారత్ 10 పాయింట్లతో ఉన్నాయి.
Comments