అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం: వెంకయ్య నాయుడు
హైదరాబాద్:,ఫిబ్రవరి 11: తెలంగాణ పోరు ఆగేదికాదని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి 24 రోజులపాటు నిర్వహించిన తెలంగాణ పోరు బాట ముగింపు సందర్భంగా శనివారం నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చేది తమ పార్టియేనని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎన్ డిఎదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అని, అందుకు ఉదాహరణ ఉత్తరాఖండ్, జార్ఖండ్ అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. అస్పష్టతగా ఉండటం రాష్ట్రానికి, దేశానికి మంచిదికాదన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే తాము సమర్ధిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో లేదన్నారు.ఒక ఓటు రెండు రాష్ట్రాలని బిజెపి చెప్పిన మాట నిజమేనni, అయితే జనం తమకు ఓటు వేయలేదని, తమకు అధికారం ఇవ్వలేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తామని చెప్పారు.
Comments