అమెరికా రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ విద్యార్ధి మృతి
హైదరాబాద్,పిబ్రవరి 15: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వేకాలనీకి చెందిన పులి రాజేశ్ (25) మృతిచెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డొనాలస్‌లో ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో రాజేశ్ ఎం.ఎస్. సెకండియర్ చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం జోరుగా కురుస్తున్న వర్షంలో రాజేశ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో మంగళవారం అర్ధరాత్రి రాజేశ్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పులి వెంకటేష్-కస్తూరి దంపతులకు రాజేశ్ ఒక్కడే కుమారుడు. మరో కుమార్తె ఉంది.
Comments