ఉప ఎన్నికలకు మొదలైన నామినేషన్లు...
హైదరాబాద్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం తో నామినేషన్ల ప్రక్రియ మొదలయింది. ఈనెల 29వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసం హరణ గడువు మార్చి మూడవ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్ ఘనాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి, కోవూరు నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్ జరుగుతుంది. 21వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
Comments