మరోసారి కేసీఆర్ 'తెలంగాణా' యాగం
హైదరాబాద్,పిబ్రవరి 15: టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ మరోసారి చండీయాగం చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోపాటు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు ఆయన ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం వేదపండితులు యాగానికి అంకురార్పణ చేశారు. కేసీఆర్ దంపతులు, కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం 2009లోనూ కేసీఆర్ ఇలాంటి యాగం నిర్వహించారు. శుక్రవారం కేసీఆర్ జన్మదినం నేపథ్యంలో ఈ యాగాన్ని శుక్రవారం సాయంత్రం ముగించనున్నారు.
Comments