ముగిసిన మేడారం జాతర
వరంగల్,ఫిబ్రవరి 11: మూడు రోజుల పాటు జరిగిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం తో ముగిసింది. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఇది. ఈ జాతరకు 80 నుంచి 85 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. గిరిజన సాంప్రదాయ పద్దతులతో శనివారం సాయంత్రం విగ్రహాలకు పూజలు చేశారు. గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మలు వనానికి తరలివెళ్లడంతో జాతర ముగిసింది.
Comments