13 నుంచి అసెంబ్లీ...17న బడ్జెట్
హైదరాబాద్, ఫిబ్రవరి 6: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. తొలిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈనెల 17న శాసనసభలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Comments