
అనంతపురం,జనవరి 23: తెలుగుదేశం దివంగత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాలలోకి వస్తాడని జరుగున్న ప్రచారానికి పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత తెర దించారు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని సునీత చెప్పారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి శ్రీరామ్‌కు ఇంకా సమయం రాలేదని ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు.పరిటాల రవి సేవా ట్రస్టు కార్యక్రమాల్లో శ్రీరామ్ ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నాడని, తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నాడని ఆమె చెప్పారు.
Comments