ఇక సులభంగా యు.ఎస్. వీసాలు ...
న్యూఢిల్లీ,జనవరి 22: అమెరికాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు భారత్, చైనా దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా మంజూరు ప్రక్రియను వేగవంతంతో పాటు సరళతరం చేసేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా సమాయత్తమయ్యారు. 2011లో రికార్డు స్థాయిలో 68 వేల హెచ్1బీ వీసాలు ప్రక్రియను ఇప్పటికే కౌన్సిలర్ బృందం పూర్తి చేసిందని కౌన్సిలర్ ఎఫైర్స్ మినిస్టర్ జేమ్స్ హెర్మన్ తెలిపారు. 2011లో దేశ వ్యాప్తంగా దాదాపు 7 లక్షల వీసా అప్లికేషన్‌లు తమ కార్యాలయానికి వచ్చాయని ఆయన చెప్పారు. భారత్‌లో ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్, ముంబై దౌత్య కార్యాలయాలల్లో సిబ్బంది సంఖ్యను గత అయిదేళ్లతో పొలిస్తే గణనీయంగా పెంచినట్లు ఆయన తెలిపారు.
Comments