‘ద వాల్ స్ట్రీట్’ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్‌గా ప్రవాసాంధ్రుడు
న్యూయార్క్,జనవరి 22: ‘ద వాల్ స్ట్రీట్’ జర్నల్ మేనేజింగ్ ఎడిటర్‌గా ప్రవాసాంధ్రుడు రాజు నారిశెట్టి నియమితులయ్యారు. ఆ పత్రిక డిజిటల్ ప్రచురణలజర్మన్, జపనీస్, చైనా ఎడిషన్లకు ఆయన ఇన్‌చార్జి గా వ్యవహరిస్తారు. రాజు ప్రస్తుతం ‘ద వాషింగ్టన్ పోస్ట్’కు మేనేజింగ్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 1994లో మొదటిసారిగా ఈ పత్రికకు లో పిట్స్బర్గ్ విలేకరిగా పనిచేసిన ఆయన 2006లో యూరప్ విభాగానికి ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. గతంలో భారత్‌లో మింట్ న్యూస్ పేపరుకు రాజు నారిశెట్టి స్థాపక ఎడిటర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ అందుకున్న రాజు నారిశెట్టి గుజరాత్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు.

Comments