బ్యాంకు మారినా అదే అకౌంట్ నంబర్...
న్యూఢిల్లీ,జనవరి 4: బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌ను కొనసాగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొబైల్ నంబర్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి అమలులోకి వచ్చిన పోర్టబిలిటీ (మార్పిడి) సదుపాయం ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు కూడా విస్తరించనుంది. ఈ దిశగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి డి.కె.మిట్టల్ తెలిపారు.
Comments