రాహుల్ గాంధీ పై బూటు విసిరిన యువకుడు...
డెహ్రాడూన్,జనవరి 23: కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పైకి ఓ యువకుడు సోమవారం బూటు విసిరాడు. డెహ్రాడూన్‌లో ర్యాలీలో పాల్గొన్న రాహుల్ పైకి ఓ యువకుడు షూ విసిరిన ఈ సంఘటన కలకలం రేపింది. ఆ యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఈ ఘటన తనపై ఏ విధమైన ప్రభావం చూపబోదని అన్నారు. బిజెపి బలంగా ఉన్న ఉత్తరాఖండ్‌లో శానససభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు. డెహ్రూడూన్‌లోని వికాస్‌నగర్‌లో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

Comments