విదేశాంగ మంత్రి ఎస్. ఎం కృష్ణ కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురు
బెంగళూరు,జనవరి 21: అక్రమ మైనింగ్ కేసులో విదేశాంగ మంత్రి ఎస్. ఎం కృష్ణ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిలకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తమకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని, దర్యాప్తు కోసం లోకాయుక్త ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని వారు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కృష్ణ 2003 లో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలువైన ఖనిజాలున్న ప్రాంతంలోని అటవీ భూములను డీరిజర్వ్ చేశారని వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త దర్యాప్తు కొనసాగుతుందని జస్టిస్ ఎన్ ఆనంద తన ఉత్తర్వుల్లో ప్రకటించారు. కుమారస్వామిపై కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దీంతో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేసేందుకు మార్గం సుగమమైంది.
Comments