చలి వేస్తోంది...చంపెస్తోంది...
హైదరాబాద్,జనవరి 17: రాష్ట్రం లో చలి తీవ్రత పెరిగింది. మూడు రోజులుగా చలికి తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 మంది మృతి చెందారు. గుంటూరులో ఆరుగురు, శ్రీకాకుళం, కరీంనగర్‌లో నలుగురు, నల్గొండలో ఇద్దరు చనిపోయారు. మంగళవారం విజయనగరం జిల్లాలో ఒక వృద్ధుడు, శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ మహిళ మృతి చెందారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మూడు రోజులుగా సున్నా, అంతకంటే తక్కువ డిగ్రీల ఊష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, గుంటూరు, అదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్రమైన చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు ఉత్తరాదిన కూడా చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది.
Comments