మరో సారి ఇన్నింగ్స్ ఓటమి: సిరీస్ అసీస్ కైవశం
పెర్త్,జనవరి 15: భారత్ మరో సారి ఇన్నింగ్స్ ఓటమి మూట గట్టుకుంది. పెర్త్ లో జరిగిన మూడో టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 37 పరుగుల తేడాతో అసీస్ చేతిలో ఓడిపోయింది. మొదటి ఇన్నింగ్స్ లో 208 పరుగులు వెనకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకె ఆల్ అవుట్ అయింది. దీనితో నాలుగు టెస్ట్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 3-0 తో కైవశం చేసుకుంది. నాల్గవ, ఆఖరి టెస్ట్ ఈ నెల 24న అడిలాయి డ్ లో మొదలవుతుంది.
Comments