గూగుల్, ఫేస్‌బుక్ సహా సామాజిక వెబ్‌సైట్లపై చర్యలు
న్యూఢిల్లీ,జనవరి 13: సమాజంలోని వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, అభ్యంతరకర, అశ్లీల సమాచారాన్ని పొందుపర్చడం తదితర అభియోగాలపై సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లు గూగుల్, ఫేస్‌బుక్ సహా 19 వెబ్‌సైట్లపై చట్టపరమైన చర్యలకు కేంద్రం ఆమొదం తెలిపింది. విద్వేషాలను రగల్చటం, దేశ సమైక్యతకు భంగం కలిగించడం, అభ్యంతరక సమాచారాన్ని పొందుపర్చడం వంటి అభియోగాల్ని ఆయా సైట్లపై మోపారు. యాహూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర సంస్థలపై చర్యలు తీసుకునేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కేంద్రం ఢిల్లీ న్యాయస్థానానికి తెలిపింది. రికార్డులను వ్యక్తిగతంగా పరిశీలించిన తరువాత ఆయా వెబ్‌సైట్లపై చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలున్నట్లు అనుమతుల విభాగం సంతృప్తి చెందినట్లు వెల్లడించింది. వెబ్‌సైట్లపై ఐపీసీ సెక్షన్లు 153-ఎ, 153-బి, 295-ఎ కింద కేసులు నమోదుకు సూచించినట్లు తెలిపింది. ఈమేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుధీష్‌కుమార్‌కు రెండు పేజీల నివేదిక అందచేసింది.
Comments