అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం
వాషింగ్టన్,జనవరి 11: అమెరికాలోని అట్లాంటాలో భారత కాన్సులేట్ కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. దీంతో న్యూయార్క్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌లలో ఉన్న కాన్సులేట్ కార్యాలయాలతో కలిపి అమెరికాలో మొత్తం ఐదు కార్యాలయాలు భారతీయులకు సేవ లందిస్తున్నాయి. అట్లాంటాలోని ఈ నూతన కాన్సులేట్ ద్వారా జార్జియా పరిధిలోని లక్ష మంది వరకూ భారతీయులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా ఆగ్నేయ అమెరికాలో సుమారు 2 లక్షల 90 వేల మందికి ఈ కాన్సులేట్ ద్వారా ప్రయోజనం కలగనుంది. సీనియర్ భారత దౌత్యవేత్త అజిత్ కుమార్‌ను నూతన కాన్సులేట్‌కు మొదటి కాన్సుల్ జనరల్‌గా భారత్ నియమించింది.
Comments