ఇన్నింగ్స్ తేడాతో చాప చుట్టేసిన టీమిండియా
సిడ్నీ, జనవరి 6: అనుకున్నట్లే సిడ్నీ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో చాప చుట్టేసింది. అసీస్ టీమిండియాపై ఇన్నింగ్స్, 68 పరుగులతో విజయం సాధించింది. ఇన్నింగ్స్ తేడాతో భారత్‌పై గెలవడం ఆసీస్‌కు ఇది పదోసారి కాగా, ఒక్క సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఇది మూడోసారి. తొలి ఇన్నింగ్స్ లో 468 పరుగులతో వెనుకబడి నాలుగో రోజు ఉదయం రెండు వికెట్లకు 114 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, టీ బ్రేక్ తర్వాత కాసేపటికి 400 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్ 2-0తో సిరీస్ పై పట్టు బిగించింది .
Comments