బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టుకు శ్రీలక్ష్మి
న్యూఢిల్లీ,జనవరి 3: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో తన బెయిల్ రద్దుపై ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సుప్రీంకోర్టుకెక్కారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈనెల 2వ తేదీన హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మంగళవారం శ్రీలక్ష్మీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓఎంసీ అనుమతుల విషయంలో తాను ఏ తప్పు చేయలేదంటూ ఆ పిటిషన్‌లో ఆమె మూడు కారణాలను తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున, మహిళ అయినందున తనకు బెయిల్ కొనసాగించాలని, సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని, ఏ తప్పు చేయలేదు కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంలేదని ఆమె పేర్కొన్నారు. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను సోమవారం హైకోర్టు కొట్టివేస్తూ, ఈనెల 6వ తేదీ లోపల నాంపల్లి కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments