 |
| జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి |
హైదరాబాద్,జనవరి 3: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో తొలి అరెస్టు జరిగింది. వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికను ప్రచురించే జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డిని సిబిఐ సోమవారంనాడు అరెస్టు చేసింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఆయన రెండో నిందితుడు. సోమవారం సిబిఐ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు విజయ సాయి రెడ్డిని ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. ఆయన ఇంతవరకు 30 సార్లు సిబిఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనపై ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆయన ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జగతి పబ్లికేషన్స్‌కు ఆయన పెట్టుబడులు సంపాదించారు. జగతి పబ్లికేషన్స్ పెట్టుబడులన్నీ విజయసాయి రెడ్డికి తెలుసునని అంటారు. ఓబిసి డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. వైయస్ హయంలో ఆయన టిటిడి బోర్డు సభ్యుడిగా పనిచేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో 74 మంది నిందితులుగా ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ 17వ తేదీన సిబిఐ ఈ కేసు నమోదు చేసింది.
Comments