వరుణ్ కొత్త సినిమా
హైదరాబాద్: వరుణ్‌సందేశ్, మోనాల్‌గజ్జర్ జంటగా నంద్యాల రవిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమార్ బ్రదర్స్ సినిమా పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఇప్పటివరకు లవర్‌బోయ్ పాత్రలకే పరిమితమయ్యాను. అయితే ఈ చిత్రంలో వాటికి భిన్నమైన పాత్ర చేస్తున్నాను. ఇది ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్’’ అని వరుణ్ ఈ సందర్భంగా అన్నాడు. కె.ఎం. రాధాకృష్ణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ, ఈ బేనర్‌లో ఇది ఆరవ సినిమా అని దాదాపు తెలుగు పరిశ్రమలో ఉన్న హాస్యనటీనటులందరూ ఇందులో నటిస్తున్నారని, వచ్చే వేసవికి సినిమాని విడుదల చేస్తామని చెప్పారు. మోనాల్ గజ్జర్ మాట్లాడుతూ, 'వెన్నెల ఒకటిన్నర' సినిమా తర్వాత నేను చేస్తున్న చిత్రమిది. సాంప్రదాయ అమ్మాయిగా కన్పిస్తాను. వినోదాత్మకచిత్రమిది అన్నారు.

Comments