రెహమాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
దుబాయ్,డిసెంబర్ 9: భారత్ సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్‌ను 8వ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ చైర్మన్ శేఖ్ మజీద్ బిన్ మొహమ్మద్ బిన్ రశీద్ అల్ ముక్తౌమ్...45 ఏళ్ల రెహమాన్‌కు ఈ అవార్డు అందజేశారు. తన సంగీతం ద్వారా భారతీయ , పాశ్చాత్య సంస్కృతులను మరింత వెలుగులోకి తెస్తున్నానని ఈ సందర్భంగా రెహమాన్ అన్నారు. గతంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, యాశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, అమెరికన్ నటులు మోర్గాన్ ఫ్రీమాన్, సీన్ పెన్, దర్శకుడు ఆలివర్ స్టోన్ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు

Comments