మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి మృతి
హైదరాబాద్,డిసెంబర్ 26: మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి సోమవారం ఉదయం మృతి చెందారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిద్దారెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు. సిద్దారెడ్డి అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1958, 64, 71 సంవత్సర కాలంలో మూడుసార్లు ఎమ్మెల్సీగా, 1983లో మధిర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.1964 సంవత్సరంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో, 1971లో పీవీ నర్సింహరావు కేబినెట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
Comments