ఆస్ట్రేలియా 277/6
మెల్‌బోర్న్,డిసెంబర్ 26: భారత ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, జహీర్‌లు రాణించడంతో ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఓపెనర్ కోవాన్ 68 పరుగులు చేయగా,, వార్నర్ 37, పాంటింగ్ 62, క్లార్క్ 31 పరుగులు చేశారు. హస్సీ, మార్ష్ పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. హాడీన్ 21 పరుగులతోను, సిడ్లే 34 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఉమేష్ యాదవ్ 3, జహీర్ 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
Comments