కోమటిరెడ్డి దీక్ష భగ్నం : నిమ్స్ లో చికిత్స
హైదరాబాద్,నవంబర్ 6: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న కోమటిరెడ్డిని ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లోని అత్యవసర చికిత్స విభాగంలో ఆయకు చికిత్స చేస్తున్నారు. నిమ్స్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments