‘శ్రీరామరాజ్యం’ నయనకు బర్త్ డే గిప్ట్ అవుతుందా?
హైదరాబాద్: ఈ నెల 17న విడుదలవుతున్న ‘శ్రీరామరాజ్యం’ సినిమా నయనతార నటజీవితంలో ప్రత్యేకమైన చిత్రం కానుంది. ఈ సినిమా తర్వాత ఆమె నటనకు గుడ్‌బై చెప్పనుంది. నవంబర్ 18 నయనతార పుట్టినరోజు జరుపుకోబోతున్న నయనతార- ‘శ్రీరామరాజ్యం’ విజయాన్ని ప్రేక్షకులు తనకు పుట్టినరోజు కానుకగా ఇవ్వాలని ఆకాంక్షిస్తోంది. '' నటిగా ఎన్ని మంచి పాత్రలు చేసినా ఆత్మసంతృప్తిని ఇచ్చింది మాత్రం ‘సీత’ పాత్రేనని, ఈ పాత్ర తన నడవడికలో కూడా మార్పును తెచ్చిందని, తన మనసుకు ఎంతో దగ్గరైందనీ' అంటోంది నయన. ఇంతటి గొప్ప పాత్రను ఇచ్చి తన గౌరవాన్ని పెంచిన బాపు, బాలకృష్ణ, యలమంచిలి సాయిబాబులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజున నయనతార తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో కలసి ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని చూస్తుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రభుదేవాతో ఆమె పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే.

Comments