ఇక మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్
హైదరాబాద్ ,నవంబర్ 23: ఇకపై దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ జారీ చేస్తామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డాక్టర్ శ్రీకర్‌రెడ్డి వెల్లడించారు. 30 రోజుల్లోగా ఆర్డినరీ పాస్‌పోర్ట్ లు అందచేస్తామని చెప్పారు. బేగంపేటలో ఈనెల 25వ తేదీన రాష్ట్రంలో మరో మూడు పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ మాన్యువల్‌గా స్వీకరిస్తున్న దరఖాస్తులను ఇకపై పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలలో ఇ-ప్రాసెసింగ్ ద్వారా తీసుకుంటామని తెలిపారు.
Comments