వరుణ్ సందేశ్ ‘చమ్మక్ చల్లో’ ...
హైదరాబాద్: రా.వన్ సినిమాలో హిట్ సాంగ్ ‘చమ్మక్ చల్లో’ పేరుతో దర్శకుడు నీలకంఠ వరుణ్ సందేశ్ హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నరు. ఇప్పటి వరకు ప్రయోగాత్మక, సందేశాత్మక చిత్రాలకే పరిమితం అయిన నీలకంఠ ఈ సారి కమర్షియల్ గా హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడంటున్నారు. డిఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షో,మిస్సమ్మ వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్సకుడు నీలకంఠ ఈ మధ్యన బాగా వెనకపడ్డారు. ఇక ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తున్న ప్రియుడు డిసెంబర్ రెండు న విడుదల అవుతోంది. అలాగే తెలుగులో పలు చిత్రాలకు మాటలు రాసిన నంధ్యాల రవి దర్సకత్వంలో వరుణ్ మరో చిత్రం చేయబొతున్నాడని సమాచారం. కుమార్ బ్రదర్శ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో కుమార్ బ్రదర్శ్...సుమంత్ హీరోగా 'రాజ్" అనే చిత్రాన్ని వియన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించారు.

Comments