వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్ విజయం
కటక్,నవంబర్ 29: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. 212 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మిడిల్ ఆర్డర్‌ను రోచ్, రస్సెల్ కుప్పకూల్చారు. ఓదశలో 159 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రోహిత్ శర్మ, వినయ్ కుమార్‌లు లక్ష్యం వైపు నడిపించారు. విజయానికి 12 కావాల్సివుండగా రోహిత్ శర్మ 72 పరుగులు చేసి సమీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత యాదవ్, ఆరోన్ కలిసి విజయానికి కావల్సిన పరుగుల్ని ఇంకా ఏడు బంతులుండగానే అందించారు. యాదవ్ 6, ఆరోన్ 6 పరుగులుతో నాటౌట్‌గా నిలిచారు. విండీస్ బౌలర్లలో రోచ్ 3, రస్సెల్ 2, మార్టిన్, సమీ, పొలార్డ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. కాగా భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో బ్రావో అత్యధికంగా 60, హ్యాత్ 31 పరుగులు చేశారు. యాదవ్, ఆరోన్‌లు రెండేసి వికెట్లు, వినయ్, అశ్విన్, జడేజా, రైనా చెరో వికెట్ పడగొట్టారు.
Comments