ధోని, అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం
న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ఒలంపిక్ గోల్డ్ మెడల్ గ్రహిత అభినవ్ బింద్రాలకు అరుదైన గౌరవం దక్కింది. వీరిద్దరికీ టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అందజేశారు. సౌత్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమానికి ధోని, బింద్రాలు హాజరయ్యారు. రక్షణ శాఖ సహయ మంత్రి పళ్ళమ్రాజు వీరిద్దరినీ అభినందించారు.

Comments