'దూకుడు' గా వస్తున్న 'బిజినెస్ మ్యాన్'...!
హైదరాబాద్: మహేష్ బాబు రాబోయే కొత్త సినిమా బిజినెస్ మ్యాన్ సంచలనాలకు సిద్దమవుతోంది. 'ఇలా రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను’’ అనే డైలాగ్ తో మహేష్ అభిమానులను అలరించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ చేసిన 'దూకుడు' వంద రోజులకు ముందే బిజినెస్ మ్యాన్ విడుదల కానుంది. ' ముంబై నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజు ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 8 కి చిత్రీకరణ పూర్తిచేసి, అదే నెల 2వ వారంలో ఆడియో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.

Comments