తెలంగాణాపై తొందరపడం: తేల్చేసిన పి.ఎం.
న్యూఢిల్లీ,నవంబర్ 13: తెలంగాణపై తొందరపడి ఏదో ఒక నిర్ణయం తీసుకోబోమని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. మాల్దీవుల్లో సార్క్ శిఖరాగ్రంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణం లో తన ప్రత్యేక విమానం లో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణా పై తొందరపాటు నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల్లో సమస్యలను సృష్టించజాలమని తెలిపారు. తెలంగాణ ఒక సంక్లిష్టమైన అంశమని, ఏకాభిప్రాయం ఆధారంగా మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. సమస్యతో సంబంధం ఉన్నవారందరూ అంగీకరించే సరైన, వాస్తవిక పరిష్కారాన్నే కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Comments